వేసవి సెలవుల్లో బాలబాలికలకు వ్యక్తిత్వ-వికాస శిబిరం నిర్వహణ
సేవా సమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి
హనుమకొండ :
హనుమకొండ శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గతనెల 28 నుండి నేటి వరకు వేసవి సెలవుల్లో నిర్వహించబడిన 10 రోజుల బాల సంస్కార్-2025 వేసవి శిబిరం జయప్రదమైందని సేవా సమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. . ప్రతి రోజు ప్రార్థన, యోగాసనాలు, ధ్యానం తర్వాత అల్పాహారం కొరకు స్వల్ప విరామం ఇవ్వబడి భజన, శ్లోకాల పఠనం మరియు నైతిక విలువల అంశాలపై నిపుణులతో అవగాహన కల్పించామన్నారు.

మాతృ-పితృ భక్తి గురించి లక్ష్మణ సుధాకర్, గురు శిష్య సంబంధంపై చక్రవర్తుల సుధాకర్, ఏకాగ్రత రహస్యంపై ఎం. తిరుపతి రెడ్డి, దేశభక్తి గురించి సౌమిత్రీ లక్ష్మణా చారి, వైద్య ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ చర్యల గురించి వైద్య నిపుణులు డా॥శివ సుబ్రహ్మణ్యం మరియు డా॥ సౌమ్య వివరించారని, సంస్కృతం పేట శ్రీనివాస్, క్రాఫ్ట్ యుగంధర్, కోలాటం రాజేష్, దండ శివప్రసాద్ శిక్షణలు అద్భుతం. 5వ రోజు కాకతీయ ప్రాశస్త్యం కల్గిన గోవిందరాజుల గుట్ట, మెట్ల బావి, ఐనవోలు పుణ్య క్షేత్రాల చరిత్ర మరియు మామునూరు పోలీసు క్యాంపు సందర్శనలు వగైరా నిత్యకృత్యాల నిర్వహణలో సేవా సమితి బాధ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస స్వామి, కే.వి.రావు, సూర్య, అనిల్, రాధిక, స్వరూప, అనిత, శిల్ప, అంజనీ దేవి, కృష్ణవేణి, శ్వేత, సరోజనమ్మ, సునీత, పార్వతి, లక్ష్మీరావు సేవలు ప్రశంసనీయం. కోలాటం శిక్షణా కోచ్ రాజేష్, దాండియా కోచ్ శివప్రసాద్, క్రాఫ్ట్ మాస్టర్ యుగంధర్ ల యొక్క శిక్షణ అద్భుతం. నేడు తల్లి దండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని డా॥ రామకృష్ణ గురూజీ శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. వరంగల్ రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజగోపాల్, కార్యదర్శి గంటా వేణుకుమార్, ప్రతినిధులు శ్రీమతి విజయగోపాల్, సుధాకర్ వరంగల్ శారద హై స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ 6 వేల రూపాయల విలువైన ఆధ్యాత్మిక సాహిత్యం పుస్తకాలను బాల-బాలికలిందరికీ బహుకరించారు. ఈ శిబిరంవల్ల పిల్లలకు-పేరెంట్సుకు దివ్యమైన అనుభూతిని, సంతుష్టిని కల్గించాయన్నారు.