తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్-17 కుస్తీ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ముగిసాయి

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హిమాయత్‌సాగర్‌లోని శ్రీ సాయి రెజ్లింగ్ అకాడమీలో కుస్తీ పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ఫ్రీస్టైల్, గ్రీకో-రోమన్ మరియు మహిళల కుస్తీ అనే మూడు విభాగాల్లో మొత్తం 120 మంది యువ కుస్తీ క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణలో కుస్తీ పట్ల యువతలో ఉత్సాహం కనిపిస్తుందని రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ తేలు కుంట సంజయ్ కుమార్ అన్నారు , పలు జిల్లాల నుంచి ఈ పోటీలలో క్రీడాకారులు పాల్గొన్నారని ఆయన తెలిపారు.

తెలంగాణ స్పోర్ట్స్ ఛైర్మన్ శివ సేనా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారని రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అహ్మద్ బిన్ హంజా క్రీడాకారులను అభినందించినట్లు సంజయ్ కుమార్ తెలిపారు అథ్లెట్లు ప్రదర్శించిన అంకితభావం, ప్రతిభ మరియు క్రమశిక్షణను ఆయన కొనియాడారు తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ (TGAWA) క్రీడాకారులందరికీ ప్రయాణ ఖర్చులను భరించడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, రాష్ట్రం నలుమూలల నుండి ఎక్కువ మంది పాల్గొనేలా చొరవ తీసుకున్నట్లు తెలిపారు

తెలంగాణ రాష్ట్రంలో కుస్తీ పోటీలను ప్రోత్సహించడానికి అసోసియేషన్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.