ఉప్పల్ నల్లచెరువు అభివృద్ధికి భారీగా నిధులు

Facebook
X
LinkedIn

రూ. 27 కోట్లతో అభివృద్ధి సుందరీకరణ పనులు

పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి , పరమేశ్వర్ రెడ్డి

తెలుగునాడు, హైదరాబాద్ :

ఉప్పల్లోని నల్లచెరువు అభివృద్ధికి భారీగా నిధులు మంజూరైనట్టుగా కార్పొరేటర్ మందుములరజిత పరమేశ్వర్ రెడ్డి ,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చెరువు అభివృద్ధికి, సుందరీకరణ పనులకు రూ.27 కోట్ల నిధులు మంజూరు చేసినట్టుగా చెప్పారు.

శనివారం కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి అధికారులతో కలిసి ఉప్పల్ నల్ల చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఉప్పల్ లోని నల్ల చెరువు ఒకవైపు కబ్జాలతోనూ, మరోవైపు కలుషిత జలాలతో ప్రమాదకర పరిస్థితి ల్లో ఉంది.

దీనిని గ్రహించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించడంతో పాటు చెరువు అభివృద్ధి, సుందరీకరణకు కావాల్సిన రూ .27 కోట్ల నిధులను మంజూరు చేయించారు.

మొదటి విడతలో చెరువు లో అభివృద్ధి పనులను చేపట్టనున్నారని రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఇందుకు 9.9 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

ఈ నిధులతో చెరువులో లోకి మంచినీరు వచ్చే విధంగా చూడటం, చెరువులో ఉన్న పూడికను తొలగించడం, చెరువు యొక్క ఎఫ్ టి ఎల్ పరిరక్షించడం, తూమును నిర్మించడం, తదితర పనులను చేపట్టనున్నట్టుగా రజిత పరమేశ్వర్ రెడ్డి చెప్పారు.

కార్యక్రమంలో హైడ్రా డీఈ నాగరాజు, ఏఈఈ సత్యబాబు, తహశీల్దార్ సత్యబాబు యూనిస్, మరియు కాంగ్రెస్ నాయకులు బాకారం లక్ష్మణ్ లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవి రెడ్డి , సల్ల ప్రభాకర్ రెడ్డి, భాస్కర్, అలుగుల అనిల్ కుమార్, బొమ్మాజీ రత్నం, విజయలక్ష్మి, మోహన్ నాయక్, నాగు నాయక్, నాగూర్ భాష, విజయ్, టైలర్ సత్తి, సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రసూల్, ఉషాల్ తదితరులు పాల్గొన్నారు.