తెలుగునాడు, ఒంగోలు :
పోరాటాల పురిటి గడ్డ’ గా పేరొందిన ‘ప్రకాశం వామపక్ష ఉద్యమం’లో రాష్ట్రానికి అత్యధిక రాష్ట్ర నాయకత్వాన్ని అందించిన చరిత్ర అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. సిపిఐ రాష్ట్ర 28వ మహాసభ ఆగస్టు 20 నుంచి 24 వరకు ఒంగోలులో నిర్వహించేందుకు ఆ పార్టీ రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో ఆదివారం సిపిఐ రాష్ట్ర 28వ మహాసభల ఆహ్వాన కమిటీ ఏర్పాటు సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో. రామకష్ణ మాట్లాడుతూ పార్టీ శత జయంతి సందర్బంగా మహాసభకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు.
నల్లూరి వెంకటేశ్వర్లు నాయకత్వంలో పార్టీ వంద సంవత్సరాల వేడుకలను తొలిసారి ఒంగోలులో సిపిఐ రాష్ట్ర 28వ మహాసభ నిర్వహించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.