తెలుగు వార్తలు / ఛాయాచిత్రాల ప్రదర్శన / సినిమా / Pushpa 2 Movie: ‘పుష్ప-2’ క్లైమాక్స్‌లో ముసుగు వ్యక్తి ఎవరో తెలిస్తే ఫ్యూజుల్ అవుటే?… విజయ్ దేవరకొండ, ఫాహాద్ ఫాజిల్ మాత్రం అస్సలు కాదు..!
పుష్ప2 ఎండ్ టైటిల్ కార్డ్స్ ముందు.. ముసుగులో ఉన్న అజ్ఞాతవ్యక్తిని చూపిస్తే.. పార్ట్3 మేయిన్ విలన్ ఇతనే అనేలా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. దాంతో.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అని సినిమా చూసిన వాళ్లు తలలు బాదుకుంటున్నారు.
Hyderabad,Telangana
Last Updated :December 9, 2024, 3:57 PM IST
01

కల్కీ తర్వాత.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆహా అనిపించిన సినిమా ఇప్పటివరకు రాలేదు. మధ్యలో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి కానీ.. బీ, సీ సెంటర్‌లలో ఈలలు వేయించే సినిమాలు మాత్రం కాలేకపోయాయి.
02

అలాంటి టైమ్‌లో ఒక స్థాయికి మించిన అంచనాలతో రిలీజైంది పుష్ప2. అసలు రిలీజ్‌కు వారం, పది రోజుల ముందు నుంచి ఈ సినిమాపై నెలకొన్న యుఫోరియా అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని కేవలం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ సినిమా లవర్స్ అమితాసక్తితో ఎదురు చూశారు.
03

కట్ చేస్తే, భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు.. ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. తెలుగులో కొందరు మిక్స్డ్ రివ్యూలు చెప్పారు కానీ.. ఆల్ ఓవర్ ఇండియాలో సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
TOP VIDEO
KTR, Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు
04

తొలిరోజు నుంచే పుష్పగాడి మేనియా ఇండియాను కమ్మేసింది. ఈ సినిమా కొట్టిన దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర రూ.290 కోట్ల రీసౌండ్ వినిపించింది. ఇక కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా రూ.800 కోట్లు దాటేసింది.