నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ చిత్రం క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రొమోషన్స్ జోరు పెరుగుతోంది. ఆ మధ్య టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ చిత్రం క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రొమోషన్స్ జోరు పెరుగుతోంది. ఆ మధ్య టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు.

తాజాగా అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండడం విశేషం. ఎవ్వరూ ఊహించని విధంగా క్రేజీ హీరోయిన్ గా ఐటెం బ్యూటీగ్గా రంగంలోకి దించుతున్నారు. ఇదంతా డైరెక్టర్ వెంకీ కుడుములు ప్లాన్. ఇలాంటి సర్ప్రైజ్ లు ఇవ్వడంలో ఇతడు దిట్ట.

బ్రో చిత్రంలో హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ..రాబిన్ హుడ్ చిత్రంలో అది దా సర్ప్రైజు అనే ఐటెం సాంగ్ లో నటించింది. త్వరలో ఈ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. మంగళవారం అంటే డిసెంబర్ 10న ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కేతిక శర్మ మోస్ట్ గ్లామరస్ లుక్ లో ఆకర్షిస్తోంది. మల్లెపూలతో డిజైన్ చేసిన అవుట్ ఫిట్ అందరినీ ఆకర్షిస్తోంది. చూస్తుంటే నితిన్, కేతిక ఇద్దరూ డ్యాన్స్ ఒక రేంజ్ లో అదరగొట్టినట్లు ఉన్నారు.