తెలుగునాడు, సికింద్రాబాద్ :
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పనులకు ఇబ్బంది తలెత్తకుండా 115రోజుల పాటు ఐదు ఫ్లాట్ ఫాంలను తాత్కాలికంగా మూసి వేయనున్నట్లు ద.మధ్య రైల్వే తెలిపింది. అదేవిధంగా ఈ నెల 15 నుంచి స్టేషన్ నుంచి వెళ్లే 120 రైళ్లను దశలవారీగా చర్లపల్లి టెర్మినల్, నాంపల్లి, కాచిగూడ మీదుగా దారి మళ్లించనున్నారు. పునర్నిర్మాణ పనుల రీత్యా 6నెలల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది..