సాక్షి తప్పుడు కథనాలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

Facebook
X
LinkedIn

టీడీపీ క్యాడర్ ను కించపరిచేలా..సమాజంలో విధ్వేశాలను రెచ్చగొట్టేలా తప్పుడు కథనాలు రాస్తున్న సాక్షి పై చర్యలు తీసుకోవాలంటూ వినతి

తెలుగునాడు, అమరావతి :

టీడీపీ, టీడీపీ క్యాడర్ మీద సాక్షిలో వస్తున్న అసత్య కథనాలపై నేడు డీజీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీఎమ్మెల్సీ అశోక్ బాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్, చిట్టిబాబు లు నేడు జగతి పబ్లికేషన్ ఎడిటర్స్ & డైరెక్టర్లపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలో వచ్చిన అసత్య కథనాలను చూపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..

అవినీతి అక్రమార్జన సొమ్ముతో పుట్టిన సాక్షి అప్పటి నుండి నేటి వరకు అబద్దపు రాతలతో అసత్యాలతో సమాజంలో విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుంది.. నాడు బాబాయిని గొడ్డలివేటుకు బలి చేసి సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అంటూ అసత్యాలు రాశారు. 11 సీట్లకు పరిమితం చేసి ప్రజా జీవితానికి పనికిరారని ప్రతి పక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీ నేతలను, జగన్ ను జనం ఇంట్లో కూర్చో బెట్టినా వారికి సిగ్గు రావడంలేదు.

ఇటీవల పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పశువేముల గ్రామానికి చెందిన వ్యక్తి హరిశ్చంద్ర తెలంగాణాలో ఉంటూ.. పింఛన్ కోసమని తన ఊరికి వస్తే.. టీడీపీ గూండాలు కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చాంటూ సాక్షిలో అసత్య వార్తలు రాశారు.. అసలు నిజం తన అల్లుడికి తనకు మధ్య ఉన్న భూ వివాధాల కారణంగా హత్య జరిగింది.. వాస్తవాన్ని పక్కన పెట్టి టీడీపీపై బురద చల్లడమే పనిగా సాక్షిలో విషం చిమ్ముతూ వార్తలు రాస్తున్నారు… దీనికి ఉదాహరణే అదే రోజు సాక్షి తెలంగాణ ఎడిషన్ లోనే మామా అల్లుళ్ల మధ్య భూ పంచాయతీలో హరిశ్చంద్రను హతమార్చారని రాశారు.. ఇటువంటి తప్పుడు కథనాలతో టీడీపీ, టీడీపీ నేతలను కించపరిచేలా కథనాలు రాయడమే కాకుండా.. సమాజంలో విధ్వేశాలను రెచ్చగొట్టేలా వారి రాతలు ఉన్నాయని.. ఇటువంటి అబద్దాల పత్రిక, సాక్షి మీడియపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందన్నారు.