బహుభాషా కోవిదులు రాహుల్ సాంకృత్యాయన్ 132వ జయంతి

Facebook
X
LinkedIn

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్పూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో

తెలుగునాడు, హైదరాబాద్ :

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్పూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలానగర్ ఆఫీసులో ప్రముఖ రచయిత బహుభాషా కోవిదులు రాహుల్ సాంకృత్యాయన్ 132వ జయంతి సందర్భంగా నివాళి కార్యక్రమం జరిగింది. స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. రాహుల్ సాంకృత్యాయన్ చిత్రపటానికి సీనియర్ నాయకులు చిత్తరంజన్ దాస్ , ఈసీఐఎల్ రిటైర్డ్ ఆఫీసర్ ఏం భాస్కర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ రాహుల్ సాంకృత్యాయన్ నిరంతర అన్వేషిగాను, దేశ దేశాలు తిరిగి అనుభవాలు చారిత్రక విషయాలు సేకరించి గ్రంథస్తం చేశారని చెప్పారు. ఎం భాస్కర్ రావు మాట్లాడుతూ రాహుల్ సాంకృత్యాయన్ దాదాపు 24 భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారని అన్నారు. అనేక భాషా సమస్యలను పరిష్కరించి దానిలోని విషయాలను అందరికీ అర్థమయ్యే భాషలో విశదీకరించాలని చెప్పారు. అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ రాహుల్ సాంకృత్యాయన్ అనేక కష్టాలను అనుభవించి, వివిధ ప్రదేశాలను సందర్శించి అనేక పుస్తకాలు రాశారని చెప్పారు. ముఖ్యంగా చారిత్రిక అంశాలను ఆనాడు లభించిన ఆధారాలకు అనుగుణంగా చారిత్రాత్మకమైనటువంటి రచనలు చేశారని చెప్పారు. ముఖ్యంగా అతి ప్రామాణికంగా ఉన్న “వోల్గాసే గంగ” పుస్తకం బహుళ ప్రచారం అయిందని చెప్పారు. ఆయన జయయౌదేయ, సింహాసేనాపతి, మధుర స్వప్నం, లోకసంచారి లాంటి అనేక రచనలు చేశారని చెప్పారు. రష్యా ప్రభుత్వం ఆయనను చారిత్రక అంశాలపై పరిశోధన కొరకు వినియోగించుకున్నారని చెప్పారు. కృష్ణమాచారి , జి శివరామకృష్ణ, రుక్కయ్య, దుర్గా చారి తదితరులు ప్రసంగించారు. అనంతరం సభ్యులందరూ చిత్రపటానికి పూలను వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాసరావు, దుర్గా చారి, చిత్తరంజన్ దాస్, ఎం భాస్కరరావు, రుక్కయ్య, కృష్ణమాచారి, గౌసియా, గొడుగు యాదగిరిరావు, జి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.