కేంద్రమంత్రి అమిత్ షా తో ఆర్. కృష్ణయ్య చర్చలు
న్యూ డిల్లీ :
కేంద్రంలో ప్రత్యేక మంత్రి శాఖ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి అమిత్ షా తో వారి నివాసంలో జాతీయ బి.సి సంక్షేమ సంఘ అధ్యక్షులు , రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అరగంట పైగా చర్చలు జరిపారు. రాజ్యాంగం ప్రకారం బి.సిల వాటా విద్యా, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగాలలో ఎప్పుడిస్తారు?- జాతీయ బి.సి కార్పొరేషన్ ద్వారా బి.సి కుల వృత్తులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలనిఈ దేశంలో గత కేంద్ర ప్రభుత్వాలు గత 76 సంవత్సరాలుగా బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదని కృష్ణయ్య పేర్కొన్నారు. విద్యా,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదు ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక కులాలకు వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వాలి కానీ 76 సంవత్సరాలు గడిచిన వాటా ఇవ్వడం లేదు. బి.సి లంటే ఉత్పత్తి కులాలు. దేశ సంపద సృష్టిస్తున్నారు. కాని సంపద అనుభవించే హక్కు లేదు. అవకాశం లేదు. పన్నులు కట్టే దేశ బడ్జెట్ ఇస్తున్నారు. కాని బడ్జెట్ లో కనీస వాటా లేదు. ఓట్లు వేసి అధికారం ఇస్తున్నారు. కాని అధికారంలో బి.సి లకు వాటా ఇవ్వడం లేదు. ఈ దేశం లో బి.సిలకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు. ఇది ప్రజస్వామ్యదేశం అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి, వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. అప్పుడు దేశంలో సమైక్యత, సమగ్రత, శాంతి ఉంటుంది. అందుకోసం బి.సి లకు రావలసిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరుగాలి. బి.సి లకు రాజ్యాంగబద్దమైన హక్కులు-వాటా కల్పించవలసిన సమయం ఆసన్నమైనది. 76 సంవత్సరాల ప్రజాస్వామ్య భారత వ్యవస్థలో 56 శాతం జనాభా గల బి.సి లకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో 5 శాతం, ఉన్నత న్యాయ స్థానాలలో 2 శాతం ప్రాతినిథ్యం లేదంటే బి.సి లకు జనాభా ప్రకారం అన్నీ రంగాలలో వాటా ఇవ్వవలిసిన ఆవశ్యకతను తెలుపుతుంది. 56 శాతం జనాభా గల బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం యుంటే ఇదేమి ప్రజా స్వామ్యం అని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చేది బిక్షం కాదు. ఇది రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య హక్కు స్వాతంత్రం వచ్చినప్పుడు బీసీలకు అసెంబ్లీ – పార్లమ్మెటుల్లో రిజర్వేషన్లు పెట్టకుండా అన్యాయం చేశారు. త్వరలో సేకరించి బోయే జనాభా గణనలో కులాల వారిగా బీసీ జనాభా గణన చేయాలని సమావేశం కోరింది. ఎస్సీ/ఎస్టీల జనాభా ను కులాల వారిగా సేకరిస్తున్నారు. బీసీల జనాభా సేకరించడానికి అభ్యంతరాలు ఏమిటి? చట్టపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేవు. పులులు తదితర జంతువుల లెక్కలు ఉన్నాయి. కానీ బిసి జనాభా లెక్కలు చేయాలంటే అనేక అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే బీసీలు తిరగబడతారని తెలిపారు . సుప్రీం కోర్టు – హై కోర్టు బి.సి. జనాభా లెక్కలు సేకరించాలని 40 సం.రాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం బి.సి జనాభా లెక్కలు తీయకుండా బికించి అన్యాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం బీసీ అనుకూల వైఖరి మార్చుకోవాలని కోరారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మనదేశంలో పీడిత కులాలను ఇంకా అంది వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ క్రింది డిమాండ్లు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిని కోరారు.పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బి.సి.ల జనాభా ప్రకారం 27శాతం నుండి 56 శాతంకు పెంచాలని కోరారు. బి.సి.ల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్‌ను తొలగించాలని కోరారు. బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని కోరారు. ఎస్సీ /ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బి.సి.లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి. యాక్ట్‌ను తీసుకురావాలని కోరారు. ప్రపంచీకరణ సరళీకృత, ఆర్థిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ /బి.సి.లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. సుప్రీం కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ ఎస్టీ బి.సి.లకు రిజర్వేషన్లు పెట్టాలని విజ్నప్తి చేశారు. కేంద్ర బడ్జెటులో రెండు లక్షల కోట్లు బీసీలకు కేటాయించి కేంద్రంలో బి.సి.లకు పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్ షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలు అమలు చేసే పధకాలకు 60 మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కోరారు. జాతీయ బి.సి కార్పొరేషన్ ద్వారా బి.సి కుల వృత్తులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.
హోం మంత్రి అమిత్ షా హామీ :
బీసీల డిమాండ్లు న్యాయమైనవి, దశల వారీగా పరిష్కరిస్తామని, అన్నీ రంగాలలో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయినధని, ఇంకా పూర్తి స్థాయి న్యాయం చేయడం కోసం ప్రధానమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి డిమాండ్లను పరిష్కరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.