- 1975 శోభన్ బాబు అభిమానులకు చలన చిత్ర చరిత్రలో గోల్డెన్ ఇయర్ .. భట్టిప్రోలు
తెలుగునాడు భీమవరం ;
తెలుగు సినిమా పరిశ్రమలో నటభూషణ శోభన్ బాబు నటుడిగా సూపర్ డూపర్ చిత్రాలను అందించారని, అందులో ఎన్నో మైలురాయిని అందుకున్నాయని, కొన్ని చిత్రాలు ఎరగని ముద్రలని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్స్ భట్టిప్రోలు శ్రీనివాసరావు, పూడి శ్రీనివాస్, ఎమ్. సుధాకర్ బాబు, టి. వీర ప్రసాద్ అన్నారు. పాత్రల వైవిధ్యం, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో శోభన్ బాబు చేసిన 8 చిత్రాలు ఇప్పటికీ 50 వసంతాలు పూర్తి చేసుకున్నాయని, 1975 సంవత్సరంలో “దేవుడు చేసిన పెళ్లి, అందరూ మంచి వారే, బాబు, జీవన జ్యోతి, బలిపీఠం, జేబు దొంగ, గుణవంతుడు, సోగ్గాడు” వంటి చిత్రాలు అభిమానులను అలరించాయని అన్నారు.చలన చిత్ర చరిత్రలో గోల్డెన్ ఇయర్ 1975 అని, సూపర్ డూపర్ హిట్ లతో కలెక్షన్లు సృష్టించాయని అన్నారు.టి.సాయి కామరాజు, బి. బాలసుబ్రమణ్యo, యు. విజయ్, కుర్రా రాంబాబు, ఎస్. ఎన్. రావు, జి. జవహర్ బాబు,ధార సత్యనారాయణ అన్నారు.
ఆంధ్రుల అందాల అభిమాన కథ నాయకుడు శోభన్ బాబు
రాముని పాత్రలో తెలుగింటి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పోయే ముఖం శోభన్ బాబుదేనని, ఇలా అన్ని జానర్లలోనూ నటించి ఎవర్ గ్రీన్ సోగ్గాడిగా గుర్తింపు పొందిన నటభూషణ శోభన్ బాబు 89వ జయంతి అని భట్టిప్రోలుశ్రీనివాసరావు, బొండా రాంబాబు అన్నారు. కారుమూరి భాస్కరరావు, అడ్డాల సత్యనారాయణ,లోయ వేణు బెనర్జీ,పెదపాటి రాజబాబు, సతీష్ ఆంధ్రుల అందాల అభిమాన కథ నాయకుడు శోభన్ బాబు అని అన్నారు.