ఆది లీల ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆదినారాయణ
తెలుగునాడు, హైదరాబాద్ ; సాంస్కృతిక రంగం ద్వారా మాతృభాషతో పలు కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం సులభంగా తీసుకురావచ్చని ఆదిలీల ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆదినారాయణ తెలిపారు . తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ డాక్టర్ వెన్నెల ను మాదాపూర్ లోని వారి ఆఫీస్ నందు కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా సాంస్కృతిక రంగంపై పలు విషయాలను చర్చించారు ఈ సందర్భంగా డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలు సాంస్కృతిక రంగం పై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు సామాన్యుడికి ప్రభుత్వ పథకాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సులభంగా అవగాహన చేసుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తే ఫలితాలు బాగా వచ్చి రాష్ట్రం అన్ని రంగాల లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ జాతీయ కార్యదర్శి నాదెండ్ల సుధాకర్ ఫౌండర్ మెంబర్ ఫైనాన్స్ రాజు సేవాదళ్ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి నాదెండ్ల పద్మిని తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెన్నెల ను ఘనంగా సత్కరించారు