మోడీ పాలనలో అన్నిమతాలకు గౌరవం: ఈటల రాజేందర్

Facebook
X
LinkedIn

తెలుగునాడు :

అజ్మీర్ లోని గరీబ్ నవాబ్ హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో 813వ ఉర్సు సందర్భంగా తెలంగాణ బీజేపీ మైనార్టీ మోర్చా తరఫున చాదన్ ను పంపించారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో చాదర్ పంపే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనేది బీజేపీ (బీజేపీ) నినాదమని, నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశప్రజలందరికీ సంక్షేమం అందుతుందని అన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని మాతాలను గౌరవిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఈ పదకొండేళ్లుగా మోడీ పాలనలో ఈ దేశం ప్రశాంతంగా ఉందన్నారు. ఈ దేశ అభివృద్ధి కోసం అన్ని మతాల ప్రజల సహకారం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ, చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ ప్రవీణ్, అలీ జాకీ, జెద్దా, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.