విన్నర్‌ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!

Facebook
X
LinkedIn

బిగ్‌బాస్‌ షో ప్రారంభమైన ప్రతిసారి జనాల్లో మెదిలే ప్రశ్న.. ఈసారైనా లేడీ కంటెస్టెంట్‌ గెలుస్తారా? అని! ఈ సీజన్‌లోనూ ఆ చర్చ జరిగింది. భారీ ఫ్యాన్‌ బేస్‌తో హౌస్‌లో అడుగుపెట్టిన విష్ణుప్రియకు ట్రోఫీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉండేది. కానీ తన ఆటను చెడగొట్టుకోవడానికి ఎవరూ అక్కర్లేదు, తాను చాలు అన్నట్లే ప్రవర్తించింది.

స్వచ్ఛతకు మారుపేరు విష్ణు
గేమ్‌పై కాకుండా పృథ్వీపై ఫోకస్‌ చేసింది. తనకంట కూడా అతడే ఎక్కువ అని బాహాటంగానే ప్రకటించింది. భూతద్దం వేసి వెతికినా ఎక్కడా తనలో గెలవాలన్న కసి కనిపించలేదు. పృథ్వీ ఎలిమినేట్‌ అయ్యాక ఆటలో యాక్టివ్‌ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఆమె నిర్మొహమాటంగా, నిజాయితీగా వ్యవహరించే తీరు మాత్రం జనాలకు బాగా నచ్చేసింది.

విన్నర్‌ కంటే ఎక్కువ సంపాదన
కానీ టైటిల్‌ గెలవాలంటే ఆ ఒక్కటే ఉంటే సరిపోదు కదా! లేడీ విన్నర్‌ అవాలనుందన్న విష్ణు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఫలితంగా పద్నాలుగోవారం ఎలిమినేట్‌ అయింది. అయితే విన్నర్‌ కంటే ఎక్కువ సంపాదించేసింది. వారానికి సుమారు రూ.4 లక్షల చొప్పున పారితోషికం తీసుకుంటున్న ఈమె పద్నాలుగువారాలకు గానూ రూ.56 లక్షలు వెనకేసిందట! అంటే విన్నర్‌ ప్రైజ్‌మనీ కంటే కూడా విష్ణు ఎక్కువే సంపాదించింది.