రష్మిక ‘గర్ల్‌ఫ్రెండ్’ని పరిచయం చేసిన దేవరకొండ

Facebook
X
LinkedIn

‘పుష్ప 2’తో అందరి మనసుల్ని దోచేసిన రష్మిక.. ఇప్పుడు ‘ద గర్ల్ ఫ్రెండ్’గా రాబోతుంది. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ సాగడం విశేషం.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)

‘నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా’ అని విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్‌పై రష్మిక కనిపిస్తుంటే వీళ్లిద్దరి ఫ్యాన్స్‌కి కనులవిందుగా అనిపిస్తోంది. ఎందుకంటే చాన్నాళ్లుగా వీళ్ల రిలేషన్ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ టైంలో చూచాయిగా ప్రేమలో ఉన్నమన్నట్లు చెప‍్పారు. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే రష్మిక కోసం విజయ్ కవిత్వం చెబుతున్నాడేమో అనిపించింది.

‘ద గర్ల్ ఫ్రెండ్’ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడిగా కనిపించబోతున్నాడు. టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనిపించాయి. ఇదంతా చూస్తుంటే ఈ మూవీలో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందనిపిస్తోంది. బహుశా ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ ఉండొచ్చు.