రాళ్ల బండి అంజమ్మ కు విశ్వబ్రాహ్మణుల ఘన నివాళి

Facebook
X
LinkedIn

హైద్రాబాద్ :

విశ్వబ్రాహ్మణ జాతిరత్నం పురోహిత రత్నం రాళ్ల బండి లంకేశ్వర చారి మాతృమూర్తి కీర్తిశేషులు రాళ్ల బండి అంజమ్మ కు దశదినకర్మ కు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశా చారి హాజరై మాతృమూర్తికి ఘనంగా నివాళులు అర్పించారు. రాళ్ల బండి లంకేశ్వర చారి పంతులు విశ్వబ్రాహ్మణ జాతిలో ఆదర్శ పురోహిత రత్నం లాంటి వారి తల్లి మరణం జాతికి తీరని లోటని ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూర్చాలని
కుందారం గణేష్ చారి వలబోజు నరసింహ చారి నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో లంకేశ్వరాచారి మల్లేశ్వర చారి భార్గవాచారి వాళ్ళ బాలా చారి విఠోబా జ్యోతి విజయలక్ష్మి మరియాలా వాస్తవ్యులు పులి మామిడి, బాల బ్రహ్మచారి రామ బ్రహ్మచారి భగవంతు చారి కలకొండ బిక్షపతి మహంకాళి నరసింహ చారి, విశ్వబ్రాహ్మణ దమ్మైగూడ భవన కమిటీ చైర్మన్ ఎం ఎన్ చారి తదితరులు పాల్గొన్నారు.