ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమం

Facebook
X
LinkedIn

ఓటరు వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రారెడ్డి పిలుపు

నాగారం, :

నాగారం డివిజన్-5 వెస్ట్ గాంధీనగర్ కాలనీ ఆధ్వర్యంలో వీఆర్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, బీఎల్‌ఓ వేద ప్రకాష్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను ధ్రువీకరించుకోవాలని కోరారు.

అలాగే వ్యక్తులకు భూములు, సొంత ఇళ్లు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పులు, లోపాలు లేకుండా చూసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ అవగాహన కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అధికారులు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించారు.