సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్

Facebook
X
LinkedIn

962 కేసులు నమోదు.. రూ.9.62 లక్షల జరిమానా

మల్కాజ్‌గిరి :

వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ వినియోగిస్తున్న వారిపై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 962 కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొత్తం రూ.9.62 లక్షల జరిమానా విధించారు.

పోలీస్ కమిషనర్ బి.సుమతి ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, సిగ్నళ్లు, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మెసేజ్‌లు పంపుతూ వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకున్నారు.

సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాల ముప్పు పెరుగుతుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో ఆపి మాత్రమే ఫోన్ మాట్లాడాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.