నారాయణ పాఠశాలలో అవేరథాన్ కార్యక్రమం

Facebook
X
LinkedIn

భద్రత, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన

కాప్రా :

ఈసీఐఎల్‌లోని నారాయణ పాఠశాల (సీబీఎస్సీ) ఆధ్వర్యంలో అవేరథాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణ పాఠశాల ఏజీఎం పురుషోత్తం రెడ్డి, కుషాయిగూడ ఎస్‌ఐలు కె. సతీష్, శ్రీనివాస్, సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు విద్యార్థులు, తల్లిదండ్రులకు భద్రత, బాధ్యత, మానసిక ఆరోగ్యం, సైబర్ భద్రత, ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అలాగే ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల ఎదురయ్యే సమస్యలు, చట్టపరమైన శిక్షల గురించి వివరించారు.

పాఠశాల ప్రిన్సిపాల్ మంజు భార్గవి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఏజీఎం పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాలని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.