హైదరాబాద్‌లో టొయోటా హైరైడర్ హైబ్రిడ్ విజయోత్సవం

Facebook
X
LinkedIn

నలుగురు అదృష్టవంతులకు ఐఫోన్-17 స్మార్ట్‌ఫోన్లు బహుమతి

హైదరాబాద్ :

టొయోటా హైరైడర్ సెల్ఫ్‌-చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు విజయాన్ని పురస్కరించుకుని టొయోటా ఇండియా హైదరాబాద్‌లో ఘన వేడుక నిర్వహించింది. టొయోటా అధికారిక డీలర్ భాగస్వాములైన హర్ష టొయోటా, మోడీ టొయోటా, ఫార్చ్యూన్ టొయోటా, హెడ్‌వే టొయోటాల సంయుక్త ఆధ్వర్యంలో షరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా హైబ్రిడ్ వాహన వినియోగదారులు ఉండగా, అత్యధిక హైబ్రిడ్ కార్ల వినియోగదారులు హైదరాబాద్‌లో ఉండటం విశేషమని టొయోటా ప్రతినిధులు తెలిపారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని “ఒక మైలురాయి.. ఒక వేడుక.. నలుగురు అదృష్టవంతులు.. హైదరాబాద్‌కు ధన్యవాదాలు!” అనే నినాదంతో వేడుకను నిర్వహించారు.

టొయోటా సీనియర్ అధికారులు, మీడియా ప్రతినిధులు, సుమారు 3,000 మంది కస్టమర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక, వినోద కార్యక్రమాలతో సందడి నెలకొంది. అనంతరం నిర్వహించిన ప్రధాన వేదిక కార్యక్రమంలో టొయోటా హైబ్రిడ్ సాంకేతికత విజయగాథను వివరించారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రాండ్ లక్కీ డ్రాలో నాలుగు డీలర్‌షిప్‌ల టెస్ట్ డ్రైవ్ రిజిస్ట్రీల నుంచి ఒక్కో విజేతను ఎంపిక చేశారు. ఎంపికైన నలుగురు అదృష్టవంతులకు అత్యాధునిక ఐఫోన్-17 స్మార్ట్‌ఫోన్లను టొయోటా ప్రతినిధులు వేదికపై అందజేశారు.

ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా చేపట్టిన విస్తృత ప్రచార కార్యక్రమాలతో టొయోటా హైరైడర్ బ్రాండ్‌కు హైదరాబాద్‌లో మరింత ఆదరణ పెరిగిందని సంస్థ పేర్కొంది. హైబ్రిడ్ వాహనాలపై వినియోగదారుల విశ్వాసం, పర్యావరణహిత రవాణాపై ఆసక్తి పెరుగుతున్నందుకు ఈ వేడుక నిదర్శనమని టొయోటా ప్రతినిధులు తెలిపారు.