గత పదేళ్లుగా వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచని బిజెపి..

Facebook
X
LinkedIn

బడా పారిశ్రామికవేత్తలకే రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ

బిజెపిపై మంత్రి సీతక్క ఫైర్

హైదరాబాద్ :

బిజెపిపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత పదేళ్లుగా వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచని బిజెపి.. బడా పారిశ్రామికవేత్తలకే రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని, రైతులను విస్మరించిందని సీతక్క ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఉన్నా నిధులు తేవడంలో విఫలమయ్యారని, కేంద్రం సహకరించకున్నా తాము ఆరు గ్యారెంటీలను, ఉచిత విద్యుత్, సన్నబియ్యం బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. చారిత్రక ప్రదేశాల పర్యటనలు పెట్టుబడి సలహా సేవలు జిల్లా సమాచారం టి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 4.70 లక్షల మంది మహిళలు వ్యాపారాలు ప్రారంభించారని మంత్రి తెలిపారు. కేంద్రం తెచ్చిన మార్పుల వల్ల పని దినాలు తగ్గి రాష్ట్రంపై భారం పడుతోందని, చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీజీని చంపిన గాడ్సేకు RSS తో సంబంధం లేదా అని ప్రశ్నిస్తూ, విభజన హామీలు నెరవేర్చకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ఉపయోగం లేదని సీతక్క ఎద్దేవా చేశారు.