త్వరలో ఉప్పల్ భగాయత్ అసోసియేషన్ నూతన కమిటీ

Facebook
X
LinkedIn

త్వరలోనే పాత కమిటీ రద్దు చేస్తాం

ఉప్పల్ హెచ్ఎండిఏ భగాయత్ రైతులు..నివాస కుటుంబీకుల తీర్మానం

ఉప్పల్ :

ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్ లో అభివృద్ధి పనులు చేసేందుకు అసలైన రైతులు..రైతు కుటుంబాలు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లే అవుట్ లోని కమిటీ అసోసియేషన్ కు కేటాయించిన స్థలంలో రైతులు, నివాసితులు, అపార్ట్మెంట్ల నివాసితులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.

ఈ సందర్భంగా రైతు బిడ్డ.. భగాయత్ ఇంటి యజమాని.. ఈగ సంతోష్ ముదిరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రైతులు గోనే అర్జున్ రెడ్డి, మేకల హనుమంత రెడ్డి, నయాబ్ వెంకటేష్, బొమ్మల సుధాకర్(నిదాన కవి) లు మాట్లాడారు.

మా భూములు ప్రభుత్వానికి ఇచ్చాక.. డబ్బులు రాక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఆనాడు ధర్నాలు చేసి.. ప్రభుత్వాలు నిలదీసి..మేము దక్కించుకున్న ప్లాట్లలో మేము ఉప్పల్ భగాయత్ లో హెచ్ఎండి లే అవుట్ లో ఇంటి నిర్మాణాలు చేపట్టుకుని ఉంటున్నామన్నారు.
మాకు ఎలాంటి వసతులు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు.

కొంతమంది అసోసియేషన్ కమిటీ పేరుతో (ఎవరు ఎన్నుకోని కమిటీ..తనంతట తానే పేరు ప్రకటించుకొని అధ్యక్షునిగా చలామణి అవుతున్న కమిటీ) పేరుతో 8 ఏళ్లుగా చలాయిస్తూ ఎలాంటి అభివృద్ధి చేయకుండా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.

ఇందులో భాగంగా హెచ్ఎండిఏ లే అవుట్ లో డ్రైనేజీలు, తాగునీటి సమస్య, వీధిలైట్లు,రోడ్లు, నూతన కమిటీ ఏర్పాటు కోసం,ఇతర సమస్యలు పరిష్కరించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

సమస్యల్లో భాగంగా ఉప్పల్ భగాయత్తులో వైన్స్, గ్యాస్ గోదాం, ఓయో రూం లాంటివి ఉండడం, వీధిలైట్లు సక్రమంగా లేకపోవడం, పోలీసు పెట్రోలింగ్ సక్రమంగా లేకపోవడంతో రాత్రి సమయాల్లో ఈ ఉప్పల్ భగాయత్తు కాలనీలో అసాంఘిక కార్యక్రమాలకు ఇది నిలయంగా మారిందన్నారు.

ఈ భగాయత్ లో రెసిడెన్షియల్ ఇల్లు ఉండడంతో…ప్రజలకు అసాంఘిక కార్యక్రమాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈగ సంతోష్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, మా కాలనీ లోని గల సమస్యల పరిష్కారం కోసం తాము పాత కమిటీని రద్దుచేసి, నూతన కమిటీని ఎన్నుకుని అభివృద్ధి వైపు పయనిస్తామని పేర్కొన్నారు.

మేమంతా రైతుల కోసం కష్టపడి ఆనాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలను నిలదీస్తూ సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేయనున్నట్లుగా తెలిపారు.

ఉప్పల్ భగాయత్తులోని రైతులకు, నిర్వాసితులకు, తెలియకుండా.. ఒక కమిటీ వేసుకుని 8 ఏళ్లుగా చలామణి అవుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న ఈ కమిటీ అధ్యక్షుడు మేకల మధుసూదన్ రెడ్డిని తొలగించాలని ఏకగ్రీవంగా రైతులంతా తీర్మానం చేసినట్టు చెప్పారు.

త్వరలో నూతన నూతన కమిటీని ప్రకటిస్తామని, అందుకు భగాయత్ హెచ్ఎండి లే అవుట్ లో ఉన్న భూ యజమానులు వారి కుటుంబ సభ్యులు, ఇంటి నిర్మాణదారులు, ప్లాట్ల యజమానులు అందరూ కలిసి వచ్చి, ఉప్పల్ భగాయత్.. హెచ్ఎండిఏ లేఅవుట్ ను అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని ఈగ సంతోష్ పేర్కొన్నారు.

కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను అవలీలగా పరిష్కరించుకునేందుకు ప్లాట్ల యజమానులు సహకరించాలని కోరారు . అదేవిధంగా పాత కమిటీని రద్దుచేసి నూతన కమిటీని త్వరలో ఎన్నుకుంటామని కాలనీ వాసి ఈగ సంతోష్ తెలిపారు.