సాయిరామ్ నగర్ లో ఉచిత వైద్య శిభిరం

Facebook
X
LinkedIn

ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీ స్వర్ణరాజ్ శివమణి

కాప్రా :

కాప్రా డివిజన్ లోని సాయిరామ్ నగర్ లో గల సాయిబాబా ఆలయ ప్రాంగణంలో పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్(సౌత్ కమలానగర్) మరియు నవోదయ సంక్షేమ సంఘం(కుశయిగూడ)ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరం కార్పొరేటర్ శ్రీ స్వర్ణరాజ్ శివమణి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్.

ఈ సందర్బంగా స్వర్ణరాజ్ శివమణి మాట్లాడుతూ – సాయిబాబా ఆలయ ట్రస్ట్ చైర్మన్ – సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోంనాథ్, ఆలయ అభివృద్ధి తో పాటు సామాజిక కార్యక్రమాలలో చురుకుగాపాల్గొంటారని, స్థానిక ప్రజల ఆరోగ్యం కోసం పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్(సౌత్ కమలానగర్) మరియు నవోదయ సంక్షేమ సంఘం(కుశయిగూడ) సంయుక్త సహకారంతో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేయడం అభినందనీయన్నారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ – సాయిరామ్ నగర్ వాసులు సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరం లో అధిక సంఖ్యలో పాల్గొన్నారున్నారు. ప్రజలు ఆరోగ్యం పై శ్రద్దవహించాలని, సామాజిక బాధ్యతతో పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్(సౌత్ కమలానగర్) మరియు నవోదయ సంక్షేమ సంఘం(కుశయిగూడ) తొడ్పాటుతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరంలో జనరల్ చెకప్,బిపి, షుగర్ వంటి వైద్య సదుపాయం, ఉచిత మందులు చేయడంతో వారిని అభినంధించారు. అనంతరం ఉచిత వైద్య శిభిరం లో సేవలు వినియోగించుకున్నారు.

కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగ శేషు మాట్లాడుతూ- మానవసేవే మాధవ సేవ అని భావించి ప్రజా సంక్షేమం కోసం సాయిరామ్ నగర్ లో ఉచిత వైద్య శిభిరం నిర్వాహకులను అభినందించారు.