కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఓల్డ్ విలేజ్ లకు మహార్దశ..!

Facebook
X
LinkedIn

ఉప్పల్ ఓల్డ్ విలేజ్ భరత్ నగర్ రూ.13.25 కోట్లతో అభివృద్ధి పనులు

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో భారీగా నిధులు మంజూరు

ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్ :

మురికివాడలు, ఓల్డ్ కాలనీల అభివృద్ధినే లక్ష్యంగా చేసుకొని కావాల్సిన నిధులను రాపడుతూ పనులు చేపడుతున్నట్టుగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఉప్పల్ నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు అవుతున్నట్టుగా చెప్పారు. నియోజకవర్గంలోని మురికివాడలు, ఓల్డ్ విలేజ్ ల అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్టుగా తెలిపారు.