తెలంగాణ జాగృతి ఎజెండా కమిటీ సభ్యులతో కల్వకుంట్ల కవిత జూమ్ కాన్ఫర్మెన్స్

Facebook
X
LinkedIn

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్న ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూమ్ కాన్ఫర్మెన్స్ నిర్వహించారు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలు, అన్ని పార్టీల రాజ్యాంగాల అధ్యయనం.. అత్యంత ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగం రూపొందించడం, నీళ్లు – నిధులు – నియామకాలు సహా 32 అంశాల అధ్యయనానికి ప్రత్యేక కమిటీలు వేశామన్నారు. కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి ఈనెల 17వ తేదీ వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని సూచించారు. స్టీరింగ్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.