శాస్త్రీయ దృక్పథమే సమాజ పురోగతికి మార్గం

Facebook
X
LinkedIn

కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్

ఏఎస్ రావు నగర్ :

సమాజంలో శాస్త్రీయ ఆలోచన విధానం పెంపొందితేనే సానుకూల మార్పు సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ అన్నారు. జన విజ్ఞాన వేదిక మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా సైన్స్ క్యాలెండర్‌ను డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ బుధవారం వారి నివాసం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ.. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ప్రజల ఆలోచనా శక్తిని కట్టడి చేస్తున్నాయని, వాటిని తొలగించేందుకు తార్కిక దృక్పథం అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత శాస్త్ర విజ్ఞానాన్ని పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా దైనందిన జీవితానికి అన్వయించుకోవాలని సూచించారు. ప్రశ్నించే మనస్తత్వం అలవాటు పడితేనే వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు ఎం.శ్రీనివాస్, పి.నాగరాజు లు మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆరోగ్యం, పర్యావరణం, సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మూఢనమ్మకాలపై నిరంతరం ఉద్యమాత్మకంగా పనిచేస్తున్నామని చెప్పారు. జిల్లా స్థాయిలో రూపొందించిన సైన్స్ క్యాలెండర్ ద్వారా పిల్లల్లో, యువతలో శాస్త్రీయ దృక్పథం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తోట శ్రీనివాస్, నాయకులు సిహెచ్ ప్రభాకర్, శశిధర్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.