ఈసీ నగర్లో ఘనంగా న్యూ ఇయర్ మరియు బర్తడే సెలబ్రేషన్స్

Facebook
X
LinkedIn

మహిళా సంఘం ఆధ్వర్యంలో

చర్లపల్లి:

చర్లపల్లి డివిజన్ ఈసీ నగర్ లో ఈసీ నగర్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా న్యూ ఇయర్ మరియు బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రతి నెల నిర్వహించే 31 బర్త్డే సెలబ్రేషన్స్ మరియు డిసెంబర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా కలిపి జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు, యువత మరియు పిల్లలు ఆటపాటలతో ఆనందం వెల్లివిరిసేలా జరుపుకున్నారు. డిసెంబర్ నెల లోని పుట్టినరోజు సభ్యులు శారదా మరియు ప్రేమ సభ్యు లు కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు. సభ్యులందరూ వారికి విషెస్ తెలియజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకరికొకరు ఉత్సాహంగా తెలియపరచుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సిహెచ్ పద్మిని, లక్ష్మి, మాలతి, భవాని తదితరులు పాల్గొన్నారు.