సీఎంఆర్ఎఫ్ పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వ‌రం

Facebook
X
LinkedIn

మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి

ఉప్ప‌ల్ :

సీఎంఆర్ఎఫ్ పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వ‌రంగా మారింద‌ని ఉప్ప‌ల్ నియోజకవర్గ ఇంచార్జి మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డిపేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి అర్హులంద‌రికీ కూడా సీఎంఆర్ఎఫ్ కింద మెడిక‌ల్ బిల్లులు స‌కాలంలో చెల్లిస్తున్న‌ట్టుగా తెలిపారు. ఉప్ప‌ల్ నియోజకవర్గం చెందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను ఆదివారం ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా
ప్రమీల ₹2 లక్షలు
సత్తు కన్నా ₹60 వేలు
జి సత్యనారాయణ ₹60 వేలు
నితీష్ శ్రీవాణి ₹60 వేలు

చొప్పున మంజూరైన చెక్కుల‌ను ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి ల‌బ్ధిదారుల‌కు అంద‌చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో , రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ రఫిక్, తుమ్మల దేవి రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, వల్లపు శ్రీకాంత్ యాదవ్, గరిక సుధాకర్, లింగం, పూజారి హనుమంతు, మా శెట్టి రాఘవేంద్ర, కుసంగాల సతీష్ ముదిరాజ్, తలారి నర్సింగ్, నరసింహ, కిషన్ నాయక్, నయీమ్, హరీష్ రెడ్డి,మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు