జిల్లా, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయండి

Facebook
X
LinkedIn

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశం

మేడ్చెల్ :

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సత్వరమే పార్టీ జిల్లా, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కమిటీల నిర్మాణంతోనే ఇది సాధ్యం అవుతుందన్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి , కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ సోమవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో పార్టీ నిర్మాణం, డివిజన్ స్థాయిలో కమిటీ ఏర్పాటు, ఇతర అంశాల గురించి చర్చించారు.