రాష్ట్రంలో చలి తీవ్రత

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

రాష్ట్రం చలి గాలులతో గజగజ వణుకుతుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు బయటకు రా వాలంటేనే జంకుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలకు తోడు చలి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. ఉదయం 11 గంటలు అయినా చలి తీవ్రత తగ్గకపోవడం, మధ్యాహ్నాం ఒక్కసారిగా ఎండవేడి వాతావరణం, సాయంత్రానికే మళ్లి చలి ప్రారంభం కావడంతో చిన్నారులు, వృద్ధులు, మ హిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు ఈ చలి తీవ్రతం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయి. దీంతో నాలుగైదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో శనివారం ఉదయం వరకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, సంగారెడ్డి 7.6, ఆదిలాబాద్ 8.8, రంగారెడ్డి 9.2, సిద్దిపేట 9.4, కామారెడ్డి 9.5, నిర్మల్ 10 డిగ్రీల ఉష్ణోగత్రల నమోదయింది. దీంతో పాటు ఆదివారం తొమ్మిది జిల్లాలకు వాతావరణ కేంద్ర ఆరంజ్ హెచ్చరికలు జారీ చేసింది.