ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతి.. ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

Facebook
X
LinkedIn

అమరావతి :

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి మైనర్ బాలికను గర్భవతిని చేసిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో పాలసముద్రం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాలసముద్రం మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికకు దినేష్ అనే యువకుడు మాయమాటలు చెపి లోబరుచుకన్నాడు. కుమార్తె శరీరంలో మార్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలిక గర్భవతి అని తెయడంతో బాలికను నిలదీయడంతో దినేష్ పేరు చెప్పింది. వెంటనే పాలసముద్రం పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజశేఖర పోక్సో యాక్టు కేసు నమోదు చేసి దినేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. డి.ఎస్.పి సయ్యద్ మహమ్మద్ అజిజ్ ఆధ్వర్యంలో సిఐ హనుమంతప్ప లోతుగా విచారణ చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.