రోగాలకు మూలకారణం జన్యువులేనా?

Facebook
X
LinkedIn

 హైదరాబాద్ :

ఫిలడెల్ఫియాలోని ఒక వైద్య సంస్థలో ఒక అధ్యయనం జరిగింది. ఒక యువ వైద్యుడు గుడ్ల వల్ల నిజంగా హాని జరుగుతుందా కొలెస్ట్రాల్ లెవెల్ లో పెరుగుతాయా అని ఓ ప్రయోగం చేశాడు. అనేక వారాలపాటు ప్రతిరోజూ ఒక 4 నుంచి 6 గుడ్లు తిని ప్రయోగాలు చేశాడు. కొన్నాళ్ల తర్వాత లిపిడ్ ప్రొఫైల్ ను ల్యాబ్లో పరిశీలించాడు అతనికి ఆశ్చర్యం కలిగింది. ల్యాబ్ ఫలితాలు అతని హెచ్‌డిఎల్ పెరగడంతో పాటు కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ వాస్తవానికి తగ్గినట్లు చూపించాయి. మనం ఒకప్పుడు తప్పు అన్నది ఇప్పుడు ఒప్పుఅవుతుంది. ఇప్పుడు ఒప్పు అన్నది కొన్నాళ్ళు కు తప్పు అవుతుంది. మరి ఇలా ఎందుకు ఫలితాలు రివర్స్ అవుతాయి.. కొన్ని ఆహారాలు, హైపర్ కొలెస్ట్రాల్ ప్రమాదాల గురించి చేసిన అధ్యయనాలు కొంత కాలానికి తిరగబడ్డాయి. కొబ్బరి నూనె, రొయ్యలు, షెల్ ఫిష్, గుడ్లు, కొవ్వు మాంసాలను ఉపయోగించకూడదని 25 సంవత్సరాల క్రితం సలహా బోర్డు హెచ్చరించింది. వెన్న నెయ్యి చాలా చెడ్డది అని ప్రచారం చేయబడ్డది కానీ మనము వెస్ట్రన్ ఫుడ్ చూసాం అంటే వాళ్ళు వెన్న నెయ్యి లేనిది అసలు తినరు. బట్టర్ అనేది చాలా కామన్ గా అన్నిటిలో బ్రెడ్ మీద పూసుకునే తింటారు. ఒకప్పుడు బ్యాడ్ ఫుడ్స్ అని చెప్పినవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ బెస్ట్ ఫుడ్స్. మరి ఏది మంచిది.. ఈ ఊదరగొట్టుడు సమాచారం అంతా ఎందుకు చేస్తారు. శారీరక శ్రమకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవడం మితంగా ఆహారం తీసుకుంటూ ఉండటం ఉత్తమమైన సూచన. 80 నుండి 90% గుండె జబ్బులకు ప్రధాన కారణం ధూమపానం, మద్యపానం, జీవక్రియ వ్యాధులు మెటబాలిక్ డిసీజెస్ హెచ్ టిఎన్ రక్తపోటు, డయాబెటిస్, జన్యుపరమైన హైపర్లిపిడెమియా, హోమోసిస్టినీమియా, విపరీతమైన ఒత్తిడి అని తెలుస్తుంది.