రాచకొండ పరిధిలో పెరిగిన ఈ ఏడాది నేరాల సంఖ్య

Facebook
X
LinkedIn

2025 క్రైమ్‌ వార్షిక నివేదికను విడుదల చేసిన  సీపీ సుధీర్‌బాబు

జీడిమెట్ల :

రాచకొండ పరిధిలో ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 4,414 కేసులు నమోదయ్యాయని సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం 2025 క్రైమ్‌ వార్షిక నివేదికను విడుదల చేశారు. గత ఏడాది 28, 626 కేసులు నమోదు కాగా, 2025లో 33,040 కేసులు నమోదు అయ్యాయని వివరించారు.కిడ్నాప్ కేసులు 579 నమోదు కాగా, ఫోక్సో కేసులు 1,224 నమోదయ్యినట్టు తెలిపారు. మర్డర్ ఫర్ గెయిన్ కేసులు 3,దోపిడీ   3, దొంగతనాలు 67, ఇళ్లలో చోరీ 589 , వాహనాల చోరీలు 876 , సాధారణ చోరీలు 1, 161 ,హత్యలు 73 , అత్యాచారాలు 330 , వరకట్నం చావులు 12 ,గృహ హింస 782 కేసులు నమోదైనట్లు చెప్పారు.ఈఏడాది 20 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం స్వాధీనం చేసుకుని 668 మంది నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఇందులో 256 డ్రగ్స్ కేసులు నమోదు చేశామని, ఇందులో 2,090 కిలోల గంజాయి, 35 కిలోల గంజాయి చాక్లలెట్లు, 34 కేజీల హ్యాశిష్ ఆయిల్ , 216 గ్రాముల ఎండీఎంఏ , 10 కిలోల ఓపీఎం, 242 గ్రాముల హెరాయిన్ , 35 కిలోల గసగసాల సామగ్రి సీజ్ చేసినట్లు వివరించారు.