నావికాదళ దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు ముఖ్యఅతిథిగా మందముల పరమేశ్వర్ రెడ్డి

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

నావికాదళ దినోత్సవం సందర్భంగా నాచారంలో మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కబడ్డీ, క్యారమ్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో నాచారంలోని పలు పాఠశాలు పాల్గొన్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన పోటీల్లో గెలిచిన జట్లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. పోటీల్లో గెలిచిన విజేతలకు ఆయన బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్య తో పాటు క్రీడలకు కూడా ప్రాముఖ్యతను ఇవ్వాలన్నారు. ప్రభుత్వం క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తుందని తెలిపారు. పాఠశాలలు కూడా విద్యార్థులు క్రీడల వైపు మగ్గు చూపే విధంగా కృషి చేయాలి అన్నారు. సంతోష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. యువత ప్రస్తుతం డ్రగ్స్ కు బానిస అవుతున్నారని దాని నుంచి బయటపడడానికి క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్ గేమ్ లకు అలవాటు పడకుండా గ్రౌండ్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నావికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుకులు, ఎస్ఎస్ఎస్ యువసేన సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాచారం స్థానిక నేతలు పాల్గొన్నారు.