గోపరపల్లి సర్పంచ్ గా ఎన్నికైన మద్దెవేని రవి యాదవ్ కు బియ్యపు శంకర్ యాదవ్ అభినందనలు

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ఇటీవల తెలంగాణ లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం  గోపరపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఎన్నికైన మద్దెవేని రవి యాదవ్ కు తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి బియ్యపు శంకర్ యాదవ్ అభినందనలు తెలియచేసారు. ప్రజలకు అందుబాటులో వుంటూ, గ్రామ సమస్య లను సకాలంలో పరిష్కరిస్తూ, ముఖ్యంగా రైతు లకు అండగా వుంటూ,సర్పంచ్ పదవి కి వన్నె తేవాలని గోపరపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దిదాలని కోరారు.భవిష్యత్ లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు..