మూడో అంతస్తు నుంచి చిన్నారిని కిందకు పడేసిన కసాయి తల్లి

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

మల్కాజ్‌గిరి.. వసంతపురి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఏడు సంవత్సరాల చిన్నారి షారోని మేరిని ఆమె కన్నతల్లి మోనాలిసా మూడో అంతస్తు బిల్డింగ్ పైనుంచి కిందకు పడేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు మల్కాజ్‌గిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.