చలి తీవ్రతకు వణుకుతోన్న ఉత్తరభారతం

Facebook
X
LinkedIn

           దారుణంగా పడిపోయిన విజిబిలిటీ

   ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100కుపైగా విమానాలు రద్దు

న్యూ ఢిల్లీ :

చలి తీవ్రతకు ఉత్తరభారతం వణుకుతోంది   దేశ రాజధాని ఢిల్లీ   సహా యూపీ, పంజాబ్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఆయా ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది.ఎన్సీఆర్‌ ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఈ కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమాన, రైలు రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఫ్లైట్‌ రాడార్‌24 ప్రకారం.. పొగ మంచు కారణంగా ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఏకంగా 100కుపైగా విమానాలు రద్దయ్యాయిసుమారు 300 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు లో విజిబిలిటీ కారణంగా దాదాపు 100 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి రాకపోకలు సాగించే 90 రైళ్లు సుమారు ఆరు నుంచి ఏడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.పొగ మంచు పరిస్థితి నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు   కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని సూచించింది. ఇండిగో, ఎయిరిండియా వంటి పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. విమానాశ్రయంలో దృశ్యగోచరత తగ్గడం వల్ల పలు విమానాలు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యమయ్యాయని తెలిపాయి. విమానాల స్టేటస్‌ గురించి తెలుసుకోవడం కోసం తమ వెబ్‌సైట్లను పరిశీలిస్తూ ఉండాలని ప్రయాణికులకు సూచించాయి.