ఉత్పత్తికి అయిన ఖర్చు కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర

Facebook
X
LinkedIn

బడ్జెట్ లోనే నిధులు కేటాయించి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది
కనీస మద్దతు ధరపై లోకసభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు మ్నంత్రి సమాధానం

న్యూ డిల్లీ :

ఉత్పత్తికి అయిన ఖర్చు కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర ఇస్తామని,బడ్జెట్ లోనే నిధులు కేటాయించి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రాంనాథ్ ఠాకూర్ తెలిపారు.కనీస మద్దతు ధరపై లోకసభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు మ్నంత్రి సమాధానం ఇచ్చారు.కమీషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ నివేదిక ఆధారంగా ప్రతి ఏడు 22 పంటలకు ప్రభుత్వం.. కనీస మద్దతు ధరలు ప్రకటిస్తుంది. ఉత్పత్తికి అయిన ఖర్చు కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర ఉండేలా చూసేందుకు బడ్జెట్ లోనే నిధులు కేటాయించి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుదని మంత్రి తెలిపారు. 2015 తో పోలిస్తే 2025 సంవత్సరానికి మద్దతు ధరలు చాలా పంటలకు రెట్టింపు అయ్యాయి. పత్తికి 4100 నుండి 8110 కు పెరిగింది. సన్ఫ్లవర్ కి 3800 రూపాయల ఉంటే 7721 కి పెరిగింది. వరికీ 1410 నుండి 2369 కి పెరిగింది అని పంటల వారీగా నివేదికను పార్లమెంట్ కు సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశాన్ని ప్రపంచపటం మీద సగర్వంగా నిలబెట్టడమే కాదు. దేశంలో ఎక్కువ మంది ఆధారపడుతున్న వ్యవసాయం మీద కూడా అంతే దృష్టి పెడుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. ఒక పక్క ఎరువులకు గతంలో ఎన్నడూ లేని విధంగా రాయితీలు ఇస్తూ.. మరోపక్క పండించిన పంటకు సరైన ధర అందేందుకు కనీస మద్దతు ధర గణనీయంగా పెంచుతున్నారని ఈటల అన్నారు. దేశ సమున్నత అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని తెలిపారు.