14వ తేదీన టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా మహాసభలు 

Facebook
X
LinkedIn

జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మార్వో 

 మల్కాజ్గిరి :

 ఈ నెల 14 న జరిగే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టిడబ్ల్యూజెఎఫ్ మేడ్చల్ జిల్లా 3వ మహాసభ ల పోస్టర్ ను మల్కాజ్గిరి ఎమ్మార్వో కె వి ఎస్ సీతారాం ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ టిడబ్ల్యూజెఎఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

 రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ కార్డులు జారీ చేసేందుకు గైడ్లైన్స్ ను తీసుకు రావాలని, అక్రిడేషన్ కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా జర్నలిస్టులందరికీ ఇక్కడేషన్ కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ జి హరిప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కై హెల్త్ కార్డులు మంజూరు చేసి చేయాలన్నారు.

  జిల్లా కో కన్వీనర్ పి మల్లేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి 700 మంది జర్నలిస్టుల సమస్యలను చర్చించేందుకే ఈనెల 14వ తేదీ ఆదివారం టీ డబ్ల్యూజె ఎఫ్ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులు అందరూ ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

 టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జి రోజా రాణి మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులకు రాత్రి వేళల్లో కార్యాలయాల నుండి ఇంటికి రవాణా సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా సోషల్ మీడియాలో మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న దుష్ ప్రచారంలను ఖండించాలని, ఇటువంటివి చేసే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాజేందర్, సింగం రాజు, మోహన్ రెడ్డి, దుర్గాప్రసాద్, బాల కిషన్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.