బిఆర్ఎస్ ప్రభుత్వం లో ఇండస్ట్రీ భూముల కన్వర్షన్ పై విచారణ జరుపుతాం

Facebook
X
LinkedIn

ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకించడమే బీజేపీ పనిగా పెట్టుకుంది

నాలుక ఉందని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోం..

దమ్ముంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు రుజువు లు చూపించాలి

    —  మంత్రి శ్రీధర్ బాబు —

  హైదరాబాద్ :

ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా వ్యతిరేకించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.2022లో బిఆర్ఎస్ ప్రభుత్వం  లీజ్ లాండ్ ను ఫ్రీ హోల్డ్ చేస్తే బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు.బీజేపీ, బిఆర్ఎస్ కలసి ఆడుతున్న నాటకం ఇది.ఢిల్లీ లో కాలుష్యం పెరిగి పాఠశాల లకు సెలవులు ఇస్తున్న పరిస్థితి వచ్చింది.ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్ కు రావొద్దనే మా ప్రయత్నం.ఢిల్లీ కాలుష్య పరిస్థితి హైదరాబాద్ లో రావాలని బీజేపీ, బిఆర్ఎస్ కోరుకుంటున్నాయని విమర్శించారు..హిల్ట్ పాలసీ జీవో సొంత భూముల పై కన్జర్వేషన్ ఫీజు విధించాం.ప్రభుత్వ భూములను దారాదత్తం చేసిందే బిఆర్ఎస్..యెదేచ్చగా టైటిల్ మార్చారు.నిరూపయోగంగా ఉన్న పరిశ్రమల భూములను ఉపయోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం..సిరీస్ అనే ఫార్మా కంపెనీ కి సంబంధించిన వంద ఎకరాల ల్యాండ్ ను బిఆర్ఎస్ ప్రభుత్వం కన్జర్వేషన్ చేసింది… అప్పుడు బిఆర్ఎస్ కు నిబంధనలు గుర్తుకురాలేదా.బిఆర్ఎస్ తెచ్చిన గ్రిడ్ పాలసీ లో 30% SRO పెడితే  పరిశ్రమలు ముందుకు రాలేదు.. అందుకే మేము ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నం చేస్తున్నాం.బిఆర్ఎస్ అలసత్వం వల్లే హైదరాబాద్ పరిసరాల్లో కాలుష్యకారక పరిశ్రమలు పెరిగాయి.లీజ్ ల్యాండ్ లను ఫ్రీ హోల్డ్ చేసేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం జీవో తెచ్చింది.ప్రభుత్వ భూముల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు…ఇండస్ట్రీల వద్ద ఉన్న భూముల గురించే పాలసీ రూపొందించామన్నారు..మా ప్రభుత్వం తెచ్చిన పాలసీ పై నాచారం ఇండస్ట్రీయల్ అసోసియేషన్ మద్దతు తెలిపింది.మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటరు ,కాలుష్యకారక పరిశ్రమ లు తరలిస్తామంటే అడ్డుకుంటరు.  పాలసీ అమలుకు ఆపరేషన్ గైడ్ లైన్స్ విడుదల అయ్యాక అభ్యంతరాలు ఉంటె చెప్పండి.పాలసీ విధానం లేకుండా వందల ఎకరాల ఇండస్ట్రీ భూములను బిఆర్ఎస్ ప్రభుత్వం కన్వర్షన్ చేసింది.బిఆర్ఎస్ ప్రభుత్వం లో ఇండస్ట్రీ భూముల కన్వర్షన్ పై విచారణ జరుపుతాం.పాలసీ లేకుండా కన్వర్షన్ చేసారు.. ఇది కొందరికి లాభం జరిగింది.కేటీఆర్ రాహుల్ గాంధీ కే కాదు ఎవరికైనా లేఖ రాయవచ్చు.నాలుక ఉందని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోం.దమ్ముంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు రుజువు లు చూపించాలి.కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే ఎకరం భూమి ఇండస్ట్రీలకు ప్రభుత్వం ఇస్తుంది.ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయి, పట్టణాల్లో కాదు.ఎన్నికల కోడ్ లేని దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే తప్పేంటి.హరీష్ రావు రూల్స్ తెలిసే విమర్శలు చేస్తున్నారు.