Manchu Manoj Row: మంచు వారి ఇంట జరుగుతున్న రచ్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గడిచిన మూడు రోజులగా ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్ప.. ఏ కోశానా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. మంగళవారం నాడు జరిగిన గొడవకు కంటిన్యూగా.. ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో డబ్బులు, ఆస్తి అడగలేదని స్పష్టం చేశారు. అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అనేక బాధలు అనుభవించానని మనోజ్ చెప్పుకొచ్చారు. తన నాన్న స్నేహితులు చెప్పడం వల్లే తాను ఇంటికి తిరిగొచ్చానని మనోజ్ వివరించారు.
