బన్‌గావ్ :
తనతో రాజకీయంగా పోరాడే దమ్ము బీజేపీ కి లేదని, తనను ఓడించడం ఆ పార్టీకి సాధ్యంకాదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌లో తనకు సవాల్ విసరాలని చూస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీ పునాదులను కదిలిస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ ’ కు వ్యతిరేకంగా బన్‌గావ్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.ఎన్నికల సంఘం ఏ మాత్రం నిష్పాక్షికంగా పనిచేయడం లేదని, అది బీజేపీ కమిషన్‌గా మారిందని మమత ఆరోపించారు. ఎస్‌ఐఆర్ కారణంగానే బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ విధంగా వచ్చాయని, అక్కడ బీజేపీ ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని అన్నారు. ఒకవేళ అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను తొలగించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యమైతే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.అంటే.. ‘డబుల్ ఇంజిన్’ సర్కారు రాష్ట్రాల్లో చొరబాటుదారులు ఉన్నట్లు ఆ పార్టీ అంగీకరిస్తోందా? అని ప్రశ్నించారు. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా బయటకు వచ్చినప్పుడు ఈసీ, బీజేపీ సృష్టించిన గందరగోళాన్ని ప్రజలు గుర్తిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియను రెండుమూడేళ్లపాటు నిర్వహిస్తే సహకరిస్తామని చెప్పారు. బీజేపీ తనను ఇరుకున పెట్టలేదని, తనతో ఆటలాడొద్దని హెచ్చరించారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.