హైదరాబాద్ లో నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయండి

Facebook
X
LinkedIn

కేంద్రమంత్రి నితిన్ గడ్గరీని కలిసిన పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్


నాగపూర్ :

కేంద్రమంత్రి నితిన్ గడ్గరీని కలిసి హైదరాబాద్ లో నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణాల గురించి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చర్చించారు.కోటికి పైగా ఉన్న జనాభా, వచ్చిపోయే మరో అరకోటి మంది ప్రజలతో హైదరాబాద్ విశ్వనగరం నిత్యం రద్దీగా ఉంటుందన ఐ, హైదరాబాదులో ప్రజలు ట్రాఫిక్ జాములతో అష్ట కష్టాలు పడుతున్నారు. ఆఫీసులో పని చేసే సమయం కంటే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే సమయమే ఎక్కువ ఉందంటూ ప్రజలు వాపోతున్నారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మాలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నా పనులు నత్తనడక నడవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారంటూ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ గారి దృష్టికి తీసుకెళ్లారు.
వరంగల్ హైవేలో నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్..
నిజామాబాద్ హైవేలో నిర్మిస్తున్న కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని దీనికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని మంత్రి చెప్పారని ఈటల రాజేందర్ తెలిపారు. స్థానికంగా ఎంత ఒత్తిడి తీసుకుని వచ్చినా పనులు వేగంగా జరగడం లేదని, ఇప్పటికే వారు ఇచ్చిన డెడ్ లైన్లు అన్నీ పూర్తి అయ్యాయి కాబట్టి మంత్రిగారిని చొరవతీసుకోవాలని కోరామని ఆయన తెలిపారు. బాలానగర్ – నరసాపూర్ హైవేలో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వల్ల ఆ రూట్ లో కూడా ఒక ఫ్లైఓవర్ మరియు నాగార్జునసాగర్ x రోడ్డునుండి అమరావతి వరకు కొత్త హైవే నిర్మాణం జరగుతుంది.. ఆ రూట్ కూడా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాగర్ ఎక్స్ రోడ్ వైపు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి మంజూరు చేయాలని మంత్రిని కోరగా ఒప్పుకున్నారని త్వరలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారని తెలిపారు. నాగపూర్ లో నితిన్ గడ్గారిని కలిసిన వారిలో ఈటల రాజేందర్ తో పాటు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉన్నారు.