విశ్వవిజేతలకు రాష్ట్రపతి ఆభినందనలు.. ప్రత్యేక కానుక

Facebook
X
LinkedIn

 న్యూఢిల్లీ :

ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళ జట్టును   రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. రాష్ట్రపతి భవన్‌లో జట్టు సభ్యులను ఆమె కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించారని, యువతరానికి ఆదర్శంగా నిలిచారంటూ జట్టు సభ్యులను ముర్ము ప్రశంసించారు. జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. జట్టు సభ్యులందరూ సంతకం చేసిన ప్రత్యేకమైన జెర్సీని రాష్ట్రతికి కానుకగా అందించింది. ప్రపంచకప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేసింది. అంతకు ముందు జట్టు సభ్యులందరూ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆయనతో ముచ్చటించిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం నవీ ముంబైలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత మహిళ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.