ఫీజుల బకాయిలు చెల్లించాలన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయంముట్టడి

Facebook
X
LinkedIn

                 5 రోజులుగా కాలేజిలు ముసి వేస్తె కుడా ప్రభుత్వానికి పట్టింపు లేదా!

ఆగ్రహం వ్యక్తం చేసిన సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య 

హైదరాబాద్ :

ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో గత 5 రోజులుగా  నుంచి రాష్ట్రంలో అన్ని కాలేజీలు నిరవదికంగా బంద్ చేశారు. ఇది చాలా సీరియస్ సమస్య. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు గడుస్తున్నా బడ్జెటు విడుదల చేయకుండా అన్యాయం చేస్తుందని ప్రశ్నించారు. నేడు వేలాది మంది విద్యార్థులు నేడు హైదరాబాద్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం  ముట్టడి జరిపారు. గుంపులు గుంపులుగా విద్యార్థులు వేలాది మంది తరలివచ్చారు, పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో నీల వెంకటేష్, మోడీ రాందేవ్,   అనంతయ్య, రాజేందర్, బాణాల అజయ్ కుమార్, లింబాద్రి ,శివ యాదవ్, నరేష్ గౌడ్, నిఖిల్,బాలయ్య, తదితరులు ప్రసంగించారు.