భారత్‌పై ట్రంప్ ఘాటు దెబ్బ.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేత

Facebook
X
LinkedIn

న్యూఢిల్లీ :

వచ్చే నెల నుంచి భారత్, రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని నిలిపివేస్తుంది. నేరుగా రష్యా క్రూడాయిల్ రాక మనకు ఆగిపోతుంది. రష్యా ప్రముఖ చమరు కంపెనీలు రోస్‌నెఫ్ట్, లూకాయిల్‌పై అమెరికా భారీ స్థాయి ఆంక్షలు విధించిన తరువాత దీని ప్రభావం భారత్‌పై పడింది. అనివార్యంగా ఈ కంపెనీల నుంచి ముడిచమురు దిగుమతిని నిలిపివేయాల్సిన చక్రబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ నెల చివరి నుంచి రష్యా ముడిచమురు దిగుమతిని తగ్గించుకుంటూ వచ్చే నెల నాటికి పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడైంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా చమురును భారత్ పూర్తి స్థాయిలో నిలిపివేస్తుందని ట్రంప్ పదేపదే చెపుతూ వచ్చారు. రష్యా కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు ఈ నెల 21 నుంచి అమలులోకి వస్తాయి. దీనితో ఆయా కంపెనీలపై ఆధారపడే పలు దేశాలు ఇకపై వేరే మార్గాలను వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో చమురు సరఫరా గొలుసుకట్టు వ్యవస్థకు కుదేలు కానుంది.