ఫ్యూచర్ ఒలంపియన్స్లను తీర్చిదిద్దుతాం

Facebook
X
LinkedIn

 చిన్ననాటి నుండే క్రీడల పట్ల ఆసక్తి కలిగిద్దాం

స్పోర్ట్స్అథారిటీ  ఛైర్మన్ శివసేనారెడ్డి

 ఫ్యూచర్ ఒలంపియన్స్ కిడ్స్ వింటర్  గేమ్స్ 2025 పోస్టర్ ఆవిష్కరణ   

హైదరాబాద్ :

భావి ఛాంపియన్లను తీర్చిదిద్దాలంటే చిన్ననాటి నుండే క్రీడల్లో ఆసక్తి కలిగిన వారిని గుర్తించి ప్రోత్సహించాలని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఫ్యూచర్ ఒలంపియన్స్ ఆధ్వర్యంలో నవంబర్ 22 23 తేదీల్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగనున్న కిడ్స్ వింటర్ గేమ్స్ 2025  పోస్టర్ ను వి సి అండ్ ఎండి డాక్టర్ సోని బాల దేవి తో కలిసిఈరోజు ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించారు.సెల్ ఫోన్ గేమ్స్ కు బానిసలు అవుతున్న పసిపిల్లలను క్రీడల పట్ల ఆసక్తి కలిగించి  వారిని భావి ఛాంపియన్లుగా తీర్చిదిద్దడానికి ఫ్యూచర్ ఒలంపియన్స్  సంస్థ కృషి  చేయడం సంతోషకరమని ఆయన అన్నారు.పసితనం నుండే క్రీడల పట్ల ఆసక్తి కలిగించే విధంగా ఆరు నెలల పసిపాపల నుండి 6 సంవత్సరాల పిల్లల కోసం  వివిధ కార్యక్రమాలు రూపొందించి పిల్లల్లో క్రీడా ఆసక్తి కలిగించడం సంతోషకరమని ఆయన అన్నారు. ఒలంపిక్ తరహా పోటీలను  చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా, వారికి ఆసక్తి కలిగిన క్రీడాంశం లో వారు రాణించేట్లుగా  వివిధ దేశాల్లో ప్రాచూర్యంలో ఉన్న మాదిరిగా ఫ్యూచర్ ఒలంపియన్స్ సంస్థ ఆలోచనలు చేయడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి ,రవీందర్ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఎం భాష మరియు ఫ్యూచర్ ఒలంపియన్స్ ఫౌండర్ కే శివప్రసాద్  జనరల్ మేనేజర్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు