అయోధ్య సమీపంలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

Facebook
X
LinkedIn

    యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి

లక్నో :

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అయోధ్య సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పగ్లాబారీ గ్రామంలో పేలుడు దాటికి ఇండ్లు కుప్పకూలిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో వివిధ ఆస్పత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఘటనా స్థలానికి సమీపంలోని పలు ఇళ్ల నుంచి ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. ఈ ఘటనపై యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.