కేరళ :
కేరళలోని సుప్రసిద్ధ శబరిమల దేవాలయంలోని ద్వారపాలకుల విగ్రహాల బంగారం మాయమవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. బంగారు పూత పూసిన రాగి పలకల నుంచి బంగారం మాయమవడంపై కేరళ హైకోర్టు తాజాగా సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు విజిలెన్స్ బృందం ఈ విషయంపై తన ప్రాథమిక దర్యాప్తుపై మధ్యంతర నివేదిక సమర్పించిన అనంతరం కేరళ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. దర్యాప్తును గోప్యంగా నిర్వహించాలని, నివేదికను నేరుగా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.019లో ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు పూత పూసిన రాగి పలకలను తాపడం కోసం తొలగించారు. దీని కోసం స్పెషల్ కమిషనర్ నుంచి కానీ, కోర్టు నుంచి కానీ ముందస్తు అనుమతి తీసుకోలేదు. కనీసం సమాచారం ఇవ్వలేదు. అప్పుడు వాటి బరువు 42.8 కిలోలు. కానీ ఈ రాగి పలకలు చెన్నైలోని ఓ సంస్థకు చేరేసరికి వీటి బరువు 38.258 కేజీలు మాత్రమే ఉంది. అంటే 4.54 కేజీల బంగారం తగ్గిపోయింది. ఓ భక్తుడి ద్వారా వాటిని చెన్నైకి పంపడం కూడా వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన, వివరణ లేని వ్యత్యాసం అని పేర్కొంది.వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, కేవలం ఆరేళ్లకే తాపడంలో లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది. 2019లో ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు మరమ్మతులు చర్యలు చేపట్టింది. అయితే, వారు స్పెషల్ కమిషనర్‌కు గానీ, కోర్టుకు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ బంగారు రేకులను తొలగించడం వివాదానికి కారణమైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.