స్థానిక సంస్థ ఎన్నికలలో అభ్యర్థులుగా పెద్ద ఎత్తున యువత పోటీ చేయాలి..
తెలుగు రాష్ట్రాల యువత అధ్యక్షులు కాలపరెడ్డి సాయిబాబా
హైదరాబాద్ :
ఫీజులు బకాయిలు చెల్లించలేక స్కాలర్షిప్లు ఇవ్వలేక ఒకటి కాదు – రెండు కాదు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఆర్తనాదాలు ప్రభుత్వానికి తెలియాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్ద ఎత్తున యువత పాల్గొని అధికార పార్టీ నాయకులకు సమాధానం చెప్పేలాగా మొదటి వరుసలో అభ్యర్థులుగా యువత పోటీ చేయాలని తెలుగు రాష్ట్రాల యువత అధ్యక్షులు కాలపరెడ్డి సాయిబాబా పిలుపునిచ్చారు..ఈ ఫీజ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఈ ఫీజులు కట్టాలని కాలేజీ విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు. కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. సర్టిఫికెట్లు తెసుకోలేక కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పీజీ కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు పొందిన వారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనితో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. విదేశాలకు చదువుకోవడానికి సీట్లు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు లేక వెళ్లలేకపోతున్నారు.